Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా... ఇంతకింత శాస్తి జరుగుతుంది: కల్వకుంట్ల కవిత

Kavitha slams CM does not have humanity
Advertisement
  • స్టేచర్ అని విర్రవీగితే స్ట్రెచర్ పైకి చేర్చారన్న రేవంత్ రెడ్డి
  • ఇంకా మారకపోతే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు
  • ఇటువంటి మాటలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్న కవిత
Advertisement
తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉద్యమ నేత, ప్రజా నాయకుడు, గౌరవనీయులు అయిన కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

మానవత్వంలేని ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని కవిత హితవు పలికారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు మీకు ఇంతకింత శాస్తి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా కవిత పంచుకున్నారు. 

స్టేచర్ ఉందని విర్రవీగితే మిమ్మల్ని స్ట్రెచర్ మీదికి చేర్చారు... మీరు ఇంకా మార్చుకోకపోతే మార్చురీకి పోతారు అంటూ రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు.
Advertisement
Advertisement
K Kavitha
Revanth Reddy
KCR
BRS
Congress

More Telugu News